సినిమాలు, సన్నివేశాలు, డైలాగులు మొదలగునవి కాపీ కొట్టటం ఎంతవరకు సమంజసం !?

Posted by తెలుగు'వాడి'ని on Saturday, November 24, 2007

చాలా రోజుల క్రితం ఈ పోస్ట్ మొదలు పెట్టి కొంత రాసిన తరువాత, మధ్యలో నా ఖర్మకాలి చూసిన మహేష్ అతిధి సినిమా దెబ్బకు మరియు నవీన్ గార్ల గారి సలహా మీదట సినిమా వీక్షణానికి కొంత విరామం ప్రకటించటంతో ఇది పూర్తిగా అటకెక్కేసింది. ఈ మధ్యలో ఉచితమే కదా అని కొంత, ఇంట్లోనే కదా (సైడ్ ఎఫెక్ట్స్ తో రోడ్ల మీద లేక డ్రైవ్ చేసేటప్పుడు వెర్రివేషాలు, తింగరి ప్రవర్తనతో జనాలను ఇబ్బంది/భయపెట్టటం అనేది లేని మంచిపని కదా) చూస్తున్నాము అని మరికొంత ధైర్యం చేసి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అనే ఒక నాలుగయిదు సంవత్సరాల పాత తెలుగు సినిమా చూసి అందులో కలగలిసిన మళయాళం దెబ్బకు పెల్లుబికిన నా ఆవేశం,బాధను ఒక కొత్త టపాగా [పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా !?], మరియు అదే సినిమాలో నాకు బాగా నచ్చిన, స్ఫూర్తినీ, ఉత్తేజాన్ని కలిగించే ఒక ఆణిముత్యం లాంటి పాటకు సంబంధించి నా అభిప్రాయన్ని ఇంకొక కొత్త టపాగా [మౌనంగానే ఎదగమనీ - నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలోని పాట] మార్చే ప్రయత్నాలలో ఈ పోస్ట్ ను పూర్తి చేయటానికి నా ఆలోచనలను ప్రోదిచేసుకునే సమయం, అవకాశం చిక్కలేదు. ఇంతలో ఇప్పుడే చూసిన/చదివిన రాజేంద్ర గారి ఆర్తీని ఫలానవాడు మోసం చేసాడు ..!? అనే టపా లో చివరలో "అతడు" సినిమాను త్రివిక్రం గారు హిందీ సినిమా నుంచి 60% కాపీ కొట్టలేదా అనేదానితో ముగించటం చూసిన తరువాత, అటకెక్కి బూజుపట్టిపోయిన నా టపా గుర్తుకువచ్చి చెంగున కార్యరంగంలోకి దూకి దీనిని మీ ముందుకు తీసుకువచ్చాను. రాజేంద్ర గారి టపాలోని చివర వాక్యాలు మరచిపోయిన నా టపా గురించి గుర్తుచేసి, దానిని పూర్తిచేయటానికి దోహదం చేసినందులకు ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు.

ఇక అసలు విషయంలోకి వెళితే .....

సినిమా ఒక వ్యాపారంగా, ధనార్జనే ధ్యేయంగా తీస్తున్నప్పుడు, కాపీ కొట్టి కూడా (సరికొత్తగా తీసి) మెప్పించగలము అనే ధైర్యమో లేక ఇంతకు మించి కధ, సన్నివేశాలు మనం ఏడవలేమో అనే ఉద్దేశ్యమో లేక ఇక్కడ ప్రేక్షకులకి ఇంకా ఇది(వి) కాపీ అని తెలిసే అవకాశం లేదు అనే నమ్మకమో లేక ఒకవేళ తెలిసినా చూసే(చూస్తున్న, చూడబోయే) వీళ్లు మరియు ఈ కధా, సన్నివేశాల అసలు ఓనర్స్ పెద్దగా పీకేది(పీకగలిగేది) ఏమీ లేదు అని తెలుసుకున్న (అతి)తెలివితేటలో .. ఏదైనా కానివ్వండి ...

నా వరకు నాకు,

....ఈ కాపీయింగ్ అనేది ఏకకాలంలో కాకుండా అంటే ఈ కాపీకొట్టిన వాడి ప్రయత్నం నిజమైన ఓనర్ ని దెబ్బ తీయకుండా అంటే ఓనర్ కన్నా కాపీ గాడు సినిమాను/ట్రైలర్స్ మొదలగునవి ముందు విడుదల లాంటివి చేయనంతవరకైతే ఓకే...

....అలాగే ఒరిజినల్ సన్నివేశాల కన్నా ఈ కాపీ చేసినవి ఆయా దర్శక, మాటల రచయితలు నిజంగా ప్రేక్షకులను మెప్పించగలిగేలా తీయగలిగి మనలను నవ్వించగలిగినా లేక సంభ్రమాశ్చర్యచకితులను/ఒళ్లు గగుర్పోడిచేలా (with visual, special effects and high technical standards/values) చెయ్యగలిగేలా తీయగలిగితే ఓకే.

....ఇందుకు నాకు నచ్చిన ఓ రెండు మంచి ఉదాహరణలు : అతడు సినిమాలొ రైలు మీదకు దూకే సన్నివేశం (ఇది Money Train సినిమాలో WeslEy Snipes చేసినది :: కరెక్టే కదా!?) మరియు నువ్వు నాకు నచ్చావ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర వెంకటేష్ దైవ ప్రార్ధన, ప్రకాష్ రాజ్ తల్లి మీద కవిత (ఇది Meet The Parents సినిమాలో Ben Stiller మరియు Robert De Niro చేసినది)....మరియు మరొక అధ్బుతమైన ఉదాహరణ మన్మధుడు సినిమా (What Women Want). ఇది గుర్తు చేసింది కింద వారి కామెంట్ ద్వారా RSG గారు అందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు.(To be honest with you even though I enjoyed those original scenes in English, I enjoyed more in Telugu version seeing Mahesh's terrific screen presence in the first one and Trivikram's brilliance in wording in the latter)

అలాగని ఇది తప్పుకాకుండా పోదు మరియు తప్పుకాదు అని చెప్పటం నా ఉద్దేశ్యమూ కాదు అంతకు మించి నేనేమీ దీనిని సమర్ధించటం లేదు....

నేను చూసీచూడనట్టు పోవటానికే ఇష్టపడటానికి కారణమేమిటి అంటే....

సినిమా అనేది నా దృష్టిలో ఒక ప్రోడక్ట్ కాదు ... కాపీ కొట్టిన వాడు ముందు దాని కన్నా మంచి (betterment) ప్రోడక్ట్ చేశాడు అని జనాలు పొలోమంటూ ఈ కాపీ గాడి వెంట పరుగులు తీసి అసలు దాన్ని పుట్టిముంచెయ్యటానికి.....సినిమా వచ్చింది ఆడింది పోయింది అంతే .... దాని సరాసరి ఆయుష్షు అంతే ఒక వ్యాపార దృక్పధంలో నుంచి చూసినప్పుడు... కానీ చూసిన జనాలు వాళ్ల గుండెల్లో ప్రతిష్టించుకునే ఆ సినిమా కాలపరిమితి ఉంది చూశారా అది...అది నిజమైన ఆయుర్ధాయమంటే....అందుకే ఒక దానవీరశూరకర్ణ, మిస్సమ్మ, శంకరాభరణం, దేవదాసు, సాగరసంగమం, The God Father, షొలే, గుండమ్మ కధ, పాతాళ భైరవి చెప్పుకుంటే ఇలా ఎన్నో ... కాపీ/రీమేక్ చెయ్యమనండి వీటిని లేదా వీటిలో సన్నివేశాలను...నూటుకి నూరు శాతం ప్రజల తీర్పు ఏమిటో, ఈ సినిమాల గురించి ప్రేక్షకులు ఏర్పరచుకున్న వెలకట్టలేని అభిమానం ఏపాటిదో సుస్పష్టంగా చెప్పితీరుతారు. (ఇప్పటికే రాంగోపాల్ వర్మకు, షారూఖ్ ఖాన్ కు బాగానే బుధ్ధి చెప్పారు)....ఇది ఇంతటితో ఆగదు ఇక ముందు కూడా ఇంత కన్నా బాగానే, ఎక్కువగానే బుధ్ధి చెపుతారు..శివ రీమేక్ చేస్తే అన్న ప్రశ్నకు నాగార్జున గారి సమాధానం ఇది : 'everyone has a right to make fools of themselves. Who can stop them?' .. ఎంత బాగా చెప్పారో కదా ...

సినిమాల రాశి ఎక్కువైనప్పుడు ఇలాంటివి తప్పవేమో లేక చాలా మామూలేనేమో అనిపిస్తుంది ఎందుకంటే మన భారతీయ భాషలలో (ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళం మొదలగు ప్రధానమైనవి) వచ్చేవి అసలే వందలాది సినిమాలాయె....ఇక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు ఏమిటి అంటే ... ఒకటో, రెండో సన్నివేశాలు లేదా కొద్దో గొప్పో కధ ఒకే రకంగా ఉంటే ఏదో కాకతాళీయమేమో (కాదు అని మనకు కూడా తెలుసనుకోండి) అని సరిపెట్టుకోవచ్చు ... అలాగే నిజంగా ఒక సినిమా కధను మరొక సినిమాలో కాపీ చేస్తే ఆ నిర్మాత కాపీరైట్స్ ఉల్లంఘన కింద ఎలాగూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు (ఇది ముఖ్యంగా ఇంగ్లీష్ మరియు హిందీ సినిమా వాళ్లు కూడా బాగా కఠినంగా అమలుచేయటం మొదలు పెట్టాలి)...

దీనికి ఒక మంచి ఉదాహరణ ఈ మధ్యనే విడుదలైన ఆట సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మరియు తొలిరోజు ప్రేక్షకులు చాలా డైరెక్ట్ గా ఈ సినిమాకు ఏ సినిమా (గుడుంబా శంకర్) అనుకరణో చెప్పటం తద్వారా ఈ సినిమాకు ఫ్లాప్(ఇదొక్కటే కారణం అయ్యుండకపోవచ్చు) ముద్ర వేయటం నిజంగా రానున్న మార్పుకు సూచనగా అనిపిస్తుంది...[ఆ పైన కొసమెరుపు ఏమిటి అంటే ఈ గుడుంబా శంకర్ నిర్మాత ఆట సినిమా నిర్మాత నుంచి ఒక 15 లక్షలు రాబట్టటం తన సినిమా కధను కాపీ కొట్టినందుకు] ...

ఈ గుర్తించటం అనేది మెల్లమెల్లగా హిందీ, ఇంగ్లీష్ సినిమాల నుంచి అని తెలుసుకోవటానికి మరియు ఇలాంటి తెలుగు సినిమాలకన్నా ఆ హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూడటం లేదా ఇవే తెలుగు సినిమాలను పైరేటెడ్ సిడి లోనో లేక ఇంటర్నెట్ లో ఉచితంగా చూడటమే మంచిది అనే అభిప్రాయం కలగటానికి (ఇప్పటికే ఇవి అభిప్రాయాలు చాలా ఎక్కువగా, బలంగా మనలో నాటుకుపోవటమే కాదూ ఆచరణలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి) తద్వారా ఈ కాపీయింగ్ బాగా తగ్గిపోయే అవకాశం చాలా దగ్గరలోనే ఉన్నది అని (ఇంకా పెద్ద ఎక్కువ సమయం పట్టక పోవచ్చు) అని నా అభిప్రాయం......[ఇప్పటికే ప్రేక్షకులు మనదైన అంటే ఒరిజినాలిటీ ఉండి, మితిమీరిన హింస, వెకిలి హాస్యం లేకుండా ఉన్న సినిమాలను తారాగణంతో పని లేకుండా ఆదరించగలరు అని చెప్పటానికి ఓ మంచి ఉదాహరణ : శేఖర్ కమ్ముల సినిమాలు మరియు బొమ్మరిల్లు మొదలగునవి...]

ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ లో రెండో మూడో, విజయవాడ లో ఒకటో, రెండో థియేటర్లలో ప్రదర్శించ బడే స్థాయి నుంచి, మరియు English సినిమా USA/UK లో విడుదలైన కొన్ని నెలల తరువాత ఇక్కడ విడుదలయ్యే ప్రక్రియ నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా అవే తేదీలలో విడుదలయ్యే స్థాయికి మరియు ఏదో వెరైటీగా లేక జాకీఛాన్ లేక మంచి ఫైటింగ్స్, Visual Effects ఉన్న సినిమా అని ఇంగ్లీష్ సినిమాకు వెళ్లే కోరిక నుంచి ఈ రోజు ఇంగ్లీష్ సినిమా విడుదలవ్వగానే రివ్యూలు చూసి వెళ్లాలా వద్దా అని రడీ పోయే సెలెక్టివ్ స్థాయికి మనం వచ్చాం ....

అలాగే ఇంటర్నెట్ వినియోగం పెరిగి మన లాంటి వాళ్లు బ్లాగ్స్/సైట్స్ లో చెప్పే మరియు టివి, పత్రికలు, SMS మొదలగు వాటి ద్వారా ఈ సినిమా లేక సన్నివేశం ఏ సినిమా/సన్నివేశానికి కాపీ అనేది ఈ మిగిలిన జనాలు సైతం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు మరియు రాబోయే కాలం కూడా ఈ కాపీయింగ్ ని చాలా వరకు తగ్గించటానికి తప్పక దోహదం చేసి తీరుతుంది.
4 వ్యాఖ్యలు:

rajendra devarapalli on Nov 25, 2007, 10:51:00 PM   said...

honestly speaking our people leave alone the folks from tinseltown can not digest such impartial comments on the state of at of the telugu cinema.by the i am planning an enitre post for your twoposts

rajendra


RSG on Nov 26, 2007, 6:56:00 AM   said...

నాదీ ఇంచుమించుగా మీలాంటి అభిప్రాయమే. మన్మధుడు సినిమా What women want కి దాదాపుగా కాపీ. కానీ పూర్తిగా మక్కికి మక్కీ కాపీ కొట్టకుండా ఆ థీమ్ ని మాత్రమే తీసుకుని త్రివిక్రమ్ కథని అల్లిన తీరు నాకు బాగా నచ్చింది. మరో ఉదాహరణ గజిని (Original- Memento).


తెలుగు'వాడి'ని on Nov 26, 2007, 7:25:00 AM   said...

RSG గారు : బహుధా కృతజ్ఞతలు మరియు అభినందనలు, ఇంత చక్కటి ఉదాహరణ మరియు మంచి సినిమాను గుర్తు చేసినందుకు. అసలు నేను ఉదహరించిన అతడు, నువ్వు నాకు నచ్చావ్ కన్నా, మీరు చెప్పిన మన్మధుడు సినిమానే చాలా చక్కగా అతికినట్టుగా సరిపోతుంది ఈ బ్లాగ్ పోస్ట్ కి. మీరు చెప్పినట్టు పూర్తిగా మక్కికి మక్కీ కాపీ కొట్టకుండా ఆ థీమ్ ని మాత్రమే తీసుకుని మరియు ఇక సన్నివేశాలలోకి వెలితే అసలు ఇంగ్లీష్ లో ఏదో అనుకోకుండా ఆడవాళ్ల అలోచనలను తెలుసుకోవటం అనే దానిని ఇక్కడ మన తెలుగులో ధర్మవరపు మైక్రోఫోన్స్ సీన్స్, దానిని నాగార్జున గారు బయట టెలిఫోన్ బూత్ లో మరియు ఆఫీస్ లో టేబుల్ కింద ఏర్పాటు చేసి మార్చి పండించిన హాస్యానికి త్రివిక్రం/విజయభాస్కర్ గారికి హ్యాట్సాఫ్. మీరు చెప్పిన రెండో ఉదాహరణ గజిని(Memento) గురించి తెలుసు కానీ ఇలా సన్నివేశాలుగా పోల్చేటంతగా గుర్తులేదు, కానీ రెండు సినిమాలూ చూశాను. వీలుంటే కొంచెం పుణ్యం కట్టుకోండి. అందుకు ముందుగా కృతజ్ఞతలు.


venkat on Jan 4, 2008, 1:30:00 PM   said...

మీరు సినిమా వ్యాసాలు బాగా రాస్తున్నారు. నవతరంగం (www.navatarangam.com) కూడా వ్రాయాలనుకుంటున్నారా? అనుకుంటుంటే సంప్రదించండి.
వెంకట్


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting