నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్) - 5
ఇది నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు నచ్చిన బ్లాగులు/టపాల కు సంబంధించి ఐదవ భాగం .... ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే మొదటి , రెండవ , మూడవ, నాలుగవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.
- ఇంతకు ముందు ఇదే సిరీస్ లోని టపా వ్రాసి చాలా కాలం అవటంతో ఇందులో కొంచెం ఎక్కువ టపాలను ఇవ్వటం జరిగింది కనుక కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి అయినా ఇందులోని టపాలను చదవటానికి ప్రయత్నించండి. నాకు నచ్చినవన్నీ మీకు కూడా నచ్చాలని లేకపోయినా మీకు కొన్ని నచ్చినా, మీరు ఆయా బ్లాగర్లతో పంచుకునే ఒకటో రెండో వ్యాఖ్యలైనా వారిలో నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి, సరికొత్త ప్రేరణని కలుగజేస్తాయి అని మరువకండి.
- ఈ దిగువన ఉన్న టపాలలో నేను చాలా వాటికి వ్యాఖ్యలు వ్రాయలేదు. అందుకు కారణం నా కన్నా ముందు ఆయా టపాలను చదివిన వారు అప్పటికే నేను చెప్పాలి అనుకున్నది వారు వారి వ్యాఖ్యల రూపటంలో చెప్పటంతో నేను సింపుల్ గా 'బాగుంది' అని ఒక్క ముక్కలో చెప్పలేకో లేక వారు చెప్పింది తిరిగి నేను రిపీట్ చేయటమెందుకులే అనో తరువాత చెపుదామని మరలా వెనుకకి వచ్చేంతలో టపా పాతది అయిపోయిందిలే అని బద్దకించటమో .. రకరకాల కారణాలు .. అన్యదా భావించకండి.
- ఈ టపాలు ప్రచురించిన ఆర్డర్ కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఒకే బ్లాగులో నుంచి ఒకటికన్నా ఎక్కువ టపాలు ఉంటే వాటిని, అలాగే ఒకటో, రెండో చోట్ల ఒకే విషయంపై వ్రాసిన వాటిని కూడా ఒక గ్రూపుగా చేయటం జరిగింది. అంతే అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఎక్కువ ఆలోచించకండి!:-)
హ హా హాసిని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
blaagarla టపాలతో అమ్మ సంకలనం
"బరువు "బాధ్యతలు
అమ్మాయిలు - ఆంటీలు
బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 1
నా డీసీ ప్రయాణం - 1
ఆదివారం అగచాట్లు
క్షుర ఖర్మ
ఉద్యోగ విజయం - 1/2
లేత సాఫ్టువేరు కుర్రోడి కష్టసుఖాలు
కామెంటు ఎటూ లేదు లుక్కైనా వెయ్యి బ్రదర్
ఉప్మా పురాణం
"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?
నల్లని చందమామ
నేను ఎందుకు ప్రేమించలేదంటే.....???
పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)
అనుకోకుండా ఒక రోజు ఏం జరిగిందంటే...!!!
ఎస్కలేటరోఫోబియా..
హిడింబి హిడింబి నడుమ నేను
ఇంగ్లీషన్నయ్య -- సులక్షణక్కయ్య
వేగంగా మారుతున్న మొబైలు విపణి ...
క్రొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్
అంతర్జాలంలో వ్యాపారీకరణ
మైక్రోబ్లాగింగు... - కుచించుకుపోతున్న సమాచారం
పుస్తకంలోకి నడవటం అంటే.......
నా జ్ఞాపకాల పొరల్లో, బాల్యప్రేమల గుభాళింపులు
మీ బ్లాగెలా ఉండాలి !
మైనారిటీలది తప్పే కాదు
An Inconvenient Truth
ధర్మ సందేహాలు
కాకినాడ క్లూసెనర్!
అతివ ఆవేదన ...
ఏ రోజు నిన్ను మరువను......?
ఎందుకు రాస్తావ్?
Passport and PIO Card for your baby.
ఇంటర్ చదివిన విధంబెట్టిదనిన ...
బ్లాగింగ్ లో రాగింగ్
“చందమామ”కొక నూలు పోగు
మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?
త్వమేవాహం
Bapu Bomma - Budugu
అప్పు ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు?
సాఫ్ట్ వేర్ ఇంజనీరు కవిత
జాతి వివక్ష పై ఓ కవిత
తెలుగు బ్లాగులు ఎందుకు చదవాలి అంటే..
ఆకాశ వీధిలో ఆకుపచ్చ కన్నీరు
'నవ' అని పిలవబడేవి ఏమిటో తెలుసుకోండి
’ఐఫొను’ కి ధీటయిన జవాబు ’మిలాన్’
నమ్మ బెంగలూరు
నీకిది తెలుసా?
నిరీక్షణం
M.B.A Student (vs) B.Tech Student
10 most stupid questions' people usually ask in obvious
Think fast!!!
పరుగు సినిమా సమీక్ష
ఆటోవాలాల తో బెడదా?
A helping hand for women in distress
హెచ్1-బి జీవితం
Enjoy Reading and Happy Commenting !!!!
ఇంతే సంగతులు - చిత్తగించవలెను ... మరలా కలుద్దాం త్వరలో !
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
రోజుకి ఎన్ని టపాలు, టపా ఎలా/ఎంత ఉండాలో కూడా మీరే చెప్పేస్తారా అండీ - ?!
ఈ మధ్య ఒకరో, ఇద్దరో ఒకే రోజు ఒకటి కన్నా ఎక్కువ టపాలు ప్రచురించటం చూసి మనలో కొంతమంది పనిగట్టుకొని ప్రత్యేకంగా ఆయా బ్లాగులోకి వెళ్లి బొట్టు పెట్టి మరీ వ్యాఖ్యలు వ్రాయటం చూసి/చదివి దాని కంటే ప్రయోజనకరమైన పనిపైకి అంటే అసలు ఈ ప్రధానమైన సమస్యను ఎలా పరిష్కరించవచ్చో అనే దిశగా మన ఆలోచనలను, దృష్టిని మరల్చగలిగితే మంచిది అనే ఉద్దేశ్యంతో ఈ టపా వ్రాయటమైనది.
ఈ రోజు కార్టూన్స్ కాబట్టి ఒక్కోదానికి ఒక్కో టపా ఎందుకు ... ఒక 5/6 లేక అన్నీ కలిపి ఒక దాంట్లోనే వేయచ్చు కదా అన్నారు ... బాగుంది ... రేపు ఇంకొకరు ఒకే రోజులో 6/7 విషయాలపై స్పందించి ఒకే రోజు ఎక్కువ టపాలు ప్రచురిస్తే ఏమి చేస్తారు ... చాలా సింపుల్ .... బాసూ ! ఒకే రోజు అన్ని విషయాలపై స్పందించకయ్యా ... రోజుకొక దానిపై స్పందించు చాలు అనో .. లేక మీరు కొంచెం ఎక్కువగా స్పందిస్తున్నారండీ ఇలా అయితే మీ బ్లాగును కూడలిలో బ్లాక్ చేయిస్తాము ... జాగ్రత్త అనో .. అంటారు అంతే కదా... చాలా బాగుంది ఇలాంటి దిశానిర్ధేశనాలుంటే మన తెలుగు బ్లాగులు, తెలుగు భాష చాలా బాగా అభివృధ్ధి చెందుతాయి ... ఇక్కడ వీళ్ల వివరణ/వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఎవరూ మరీ అంత దారుణంగా ఏమీ చెప్పరు లేండి .. నీదంతా అతి ... అసలు మీ పేరు తెలుగు 'వాడి'ని అనే బదులు .. తెలుగు 'అతి'ని లేదా తెలుగు 'అతివాడి'ని అని ఉండవలసింది అని సెటైర్లు వేస్తారు ... మీరు ఎన్ని సెటైర్లు వేసినా ఎన్ని వివరణలు ఇచ్చినా అసలు సమస్యను పక్కన పెట్టినట్టే అని గమనిస్తే కొంతైనా మంచి జరిగే అవకాశం ఉంది.
ఏదైనా ఒక సైట్ (కూడలి/జల్లెడ) లో ఇలాంటి లూప్ హోల్స్ ఉంటే మాత్రం దానిని ఇలా వాడుకోవటం తప్పు కాదా అంటే తెలిసి వాడుకోవటం తప్పే కావచ్చు ... కానీ ఆ 'తెలిసే' అనే దానిని మీరు ఎలా నిర్ణయిస్తారు ... అలాగే 'నూతన భావాలు' అని నిజాయితీగా ఒప్పుకుంటే మరలా దానిమీద సెటైర్స్, కానీ టపాలో బొమ్మ బాగాలేదు అని నాలుగు అయిదు సార్లు మారిస్తే అది perfection కోసం అని .. భలే బాగుంది కదా ఈ బ్లాగునీతి ..
- నిజంగా వాళ్లు perfection కోసం నిరంతరం తపించే వాళ్లో లేక తమ టపాలలో తప్పులుంటే తట్టుకోలేని వాళ్లో లేక రేపు తమ పిల్లలకి ఇలా తప్పులున్న బ్లాగులు చూపించటం ఇష్టం లేని వాళ్లో అయిఉంటే అప్పుడు కూడా వాళ్లను చేతులు ముడుసుకుని కూర్చోమని చెప్పటమో లేక అసలు కూడలిలోనే మీ బ్లాగ్ చేర్చుకోవద్దు అని చెపుదామంటారా?
- ఇలా ప్రచురించబడిన టపాకు తరచుగా మార్పులు చేర్పులు చేసే వారికి మనందరం చెప్పే feed disable చెయ్యటం అనేది ఒక్కో సారి మర్చిపోతే అలాంటప్పుడు ప్రతి సారీ ప్రతి ఒక్కరి వ్యాఖ్యలకీ సమాధానం(సారీలు) చెప్పుకుంటూ పోవటమే మార్గమా?
- ఈలోపు ఆ బ్లాగ్ కూడలి నుంచి కొద్దికాలాం పాటు తప్పిస్తే మరలా ఎప్పుడు activate అవుతుందా అని ఎదురు చూడటం తప్ప గత్యంతరం లేదుగా? అప్పుడు కూడా అన్ని టపాలు ఒకేసారి ప్రచురించలేము కనుక రోజుకి ఒకటి/రెండు ప్రచురించుకుంటూ వెళుతుంటే అవన్నీ సమకాలీన రాజకీయాలకు సంబంధించినవి అయితే ఊకదంపుడు గారు అన్నట్టు పాతచింతకాయ పచ్చడి అయిపోయే ప్రమాదం లేదా? ఈ దిశగానేనా మనం మన బ్లాగులని తీసుకువెళ్లాలి అనుకుంటున్నది.
- Word verification తీసెయ్యరా అని మనం చాలా సులభంగా ఒక చిన్న వ్యాఖ్య వ్రాసి వచ్చేస్తూ ఉంటే అది ఏమిటో అని తలబద్దలు కొట్టుకునేవాళ్లు .. మరియు సాంకేతికంగా అంత బాగా తెలియని వాళ్లు. ఒకే టపాలో ఎక్కువ images పెడితే align చేయటం తెలియని వాళ్ల పరిస్థితి ఏమిటి?
- శతకోటి టపాలలో ఇదో కొత్త బోడి టపాలే అని తన బ్లాగుకు రావటం లేదని భావించి ఒకేసారి ఒక 10-15 టపాలు ప్రచురిస్తే అన్నా ఆయా బ్లాగర్ల attention/interest కొంచెం ఇటువైపు వస్తుందని అనుకోవటంలో కూడా తప్పు ఉందంటారా? కొత్తవారికి ఆ మాత్రం అవకాశం ఇవ్వటం లేదా వారు అలాంటి అవకాశం తీసుకోవటం భావ్యం కాదా?
ఎనిమిది నెలల క్రితం కూడలిలో మార్పులు చేర్పుల ఆవస్యకత గురించి నేను ఒకసారి బాగా చించి ఇంకా బాగా నొక్కి వక్కాణించి ఒక టపా వ్రాస్తే వచ్చిన స్పందనలు బహుస్వల్పం ... అందులోనించి ఏవైనా కొన్ని (అవి చెత్తగానో లేక ఆచరణయోగ్యంగా లేకపోతే అందరం కలిసి కొత్తవి ఆలోచిద్దాం) తీసుకుని వాటిపై దృష్టి పెట్టేలా ఒక్కరైనా ముందుకు వచ్చారా అంటే అది శూన్యం .. స్పందించకపోవటంలో తప్పులేదు ఎందుకంటే ఎవరికి ఉండే కారణాలు వారికి ఉండే ఉంటాయి ... కానీ అసలు సమస్యను పక్కన పెట్టి అంటే పరిష్కరించకుండా ఇలా బ్లాగుల్లో తర్జనిగా బెదిరింపు వ్యాఖ్యలు వ్రాయటం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. నియంతృత్వంగా, దౌర్జన్యంగా, అదరేసి బెదరేసినట్టుగా కాకుండా ... ప్రస్తుతం కూడలిని మార్చ వలసిన సమయం ఆసన్నమయ్యింది .. ఒక నాలుగు అయిదు నెలల్లో ఏదో ఒకటి చేసి దీనికి పరిష్కారం కనుక్కునే పనిలో ఉన్నామనో, ఉందామనో చెప్పవలసింది పోయి ... మరీ ఈ విధంగానా చెప్పటం .. అలాగే అంతవరకు అంటే ఈ కొద్దికాలంలో అందరూ సంయమనంతో ఉండి అంటే ఒకేసారి ఒకేరోజు దయచేసి అన్ని టపాలనూ ప్రచురించవద్దు అని చెప్పటం సమంజసంగా ఉంటుంది కదా ..
ఈ యవ్వారం చూడబోతుంటే సదా సిధ్ధంగా ఉండే సైనికుల్లాగా ప్రతి బ్లాగ్ మీద ఒక కన్నేసి ఉంచి, ఎన్ని బ్లాగుల్లోకి వెళ్లి అయినా వెళ్లి ఇలాంటి copy/paste (చాలా సులభం కదా) వ్యాఖ్యలు చేయటానికి మారటానికి ప్రయత్నించే బదులు ఆ సమయాన్ని ఫలవంతంగా వాడుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి.
ఈ బ్లాగుల్లోకి వెళ్లి వ్యాఖ్యలు వ్రాసే సమయంతోనో లేక అదే ఓపికతోనో కూడలిలో పైన ఉన్న వేరువేరు విభాగాల (సినిమా • సాహిత్యం • హాస్యం • సాంకేతికం • రాజకీయాలు • ఫొటోలు ♦ కూడలి 100) లంకెలను నొక్కో లేక అన్నింటికన్నా కింద ఉన్న మరిన్ని అనే లంకెను నొక్కో చదువుకోవచ్చుగా ... ఇలా చేయటం వలన మొదటి పేజ్ లో ఉన్న బ్లాగులతో పాటుగా గత కొద్ది రోజులుగా ప్రచురించబడిన వాటిని చదువుకోవచ్చు అన్నీ నలుగురినీ educate చేయవచ్చుగా..
కొత్త బ్లాగులు, కొత్త ఈమెయిల్ క్రియేట్ చేయటం అన్న ప్రక్రియలు ఉచితమే కాబట్టి ... ఎన్నైనా చేయచ్చు .. ఇలా ఒక ఒక 100 బ్లాగులు, వంద ఈమెయిల్స్ సృష్టించి రోజుకు ఒక 10-20 టపాలు (టైటిల్, ఒక రెండు వాక్యాలు అంతే) ప్రచురించుకుంటూ వెళుతుంటే ... వెనువెంటనే ఈ బ్లాగు పెద్దలు అందరూ ఆ బ్లాగులను block list చేసుకుంటూ వెళ్లినా .. జరగవలసిన damage 100 రోజులకు జరిగిపోయింది.... ఇక్కడ మనవాళ్ల అతి మరియు దౌర్భాగ్యపు తెలివితేటలు/వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అంటే ... ఎవరు చేస్తారండి అలా, నువ్వేదో ఎక్కువ ఊహించి వ్రాయటమే గానీ అనో లేక అక్కడదాకా వచ్చినప్పుడు ఆలోచిద్దామనో అని వ్రాసేంత ...
నాకు తెలిసినంతలో ఏదైనా బ్లాగ్ కూడలికి కలపాలి అంటే వీవెన్ గారికి డైరెక్ట్ గా మెయిల్ పంపటమో (మనలో ఎవరిని అన్నా ఎలా జత చేయాలి అని అడిగితే మనం సహజంగా వీవెన్ గారి ఈమెయిల్ ఇస్తూ ఉంటాము కాబట్టి) లేక వారే కూడలి కి వచ్చి కొత్త బ్లాగు చేర్చండి అనే లంకె చూసి అక్కడ ఉన్న వివరాలను follow అవ్వటమో చేస్తూ ఉంటాము .. ఈ పెద్దలు అందరు విడివిడిగా ఇలా ప్రతి బ్లాగులోకి వెళ్లి బెదిరింపుల వ్యాఖ్యలో లేక అభ్యర్ధనలగా ఉండే సెటైర్స్ వేసే బదులు ఈ లంకెలోనే ఆయా నియమావళిని పొందుపరచటం చెయ్యవచ్చు కదా ... లేదా కూడలి మొదటి పేజీలోనే ఇలాంటివి పొందుపర్చవచ్చు కదా ... ఆహా అలాంటివి కుదరవు ఎందుకంటే .... ఏదో ఉచితంగా ఈ మాత్రం అన్నా చేసి మనకు ఇస్తుంటే వీవెన్ గారి పై ఇంతకన్నా భారం మోపటం మంచిది కాదు అన్న సానుభూతి వాక్యాలకైతే ఏమీ కొదవ లేదు గాని .. ఇప్పటి వరకు మోస్తున్న లేక/మరియు ఇంకా వెయ్యాలి/వెయ్యవలసిన భారాన్ని ఎలా తగ్గించాలి అనే దాని గురించి ఒక్కరు కూడా ఆలోచించరు .. అంటే అసలు ఆలోచించరు అని కాదు .. ఉచిత సలహాల దాకా చాలా బాగా ఊదరగొట్టేస్తారు ... ఆచరణ దగ్గరకొచ్చేటప్పటికి ఒక్కరూ కనపడరు ...
ఏం .. ఇన్ని వందల మంది బ్లాగర్లు ఉన్నారు దేశదేశాలలో ... తలా ఒక $10-20 వేసుకుందాము ..కూడలిని ఆధునీకరించుకుందాము అని మాత్రం ఆలోచన రాదు .. డబ్బుల మాట రాగానే మాత్రం తట్టా బుట్టా సర్దుకోవటానికి అయినా సిధ్ధం ... పౌరుషం పొడుచుకు వస్తుంటే ఈ టపా కింద వ్యాఖ్యలలోనో లేక మీ బ్లాగుల్లో ఇంకో టపా/కవిత లాగానో సెటైర్ వేసి కాదు ప్రదర్శించవలసింది ... మీవంతుగా మీరు ఎలా మీ సహాయాన్ని అందించాలి అనుకుంటున్నారో దాని మీద చూపండి.
Active గా వ్రాసే బ్లాగర్లు మరియు ఈ బ్లాగుల అభివృధ్ధిని(ఎవరికి ఉండే కారణాలు వారికి ఉండొచ్చుకాక) కోరుకునే వాళ్లు కనీసం ఒక 200 మంది ఉంటారు అనుకున్నా ... ఒక్కొక్కరు ఒక $20 (ఒక్కసారిగా కాకపోయినా రెండు మూడు సార్లుగా అయినా ఓకే) వేసుకుంటే .. 200*20=$4000 ... లేదూ వంద మంది .. $10 అనుకునా ... $1000 ... అంటే అటూఇటుగా Rs. 50,000 నుండి 1,50,000 దాకా వచ్చే అవకాశం ఉంది... హైదరాబాద్ లో Rs. 15000 పెడితే LAMP (Linux Apache MySql PHP) with Flash who has good experience in Web20/Social Networking with Digg like recommendation engine వున్న వాళ్లు దొరుకుతారు ... లేదూ మనకు కావలసిన features అన్నీ మరియు architecture ఎలా ఉండాలో చెపితే ఏదొ ఒక టీమ్ కి ఒక project లాగా ఇచ్చి వేస్తే వాళ్లే చేస్తారు ... అతి తక్కువ సహాయంతో, కొంత మంది ఆలోచనల మధనంతో ఇంతటి అధ్భుతమైన platform(s) ను create చేయగలిగిన వీవెన్ గారి సారధ్యంలో తనతో పని చేయటానికి 1-3 developers ఒక 3-6 నెలల పాటు సమకూర్చగలిగితే, ఇప్పుడు ఇంత మందితో (too many cooks అనేది లేకుండా జాగ్రత్త పడాలి/పడతాం లేండి) కూడిన చర్చల ద్వారా తయారు కాబడే కూడలి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి .. అప్పుడైనా మీలో కొంత inspiration కలుగుతుందేమో చూడండి...
అప్పనంగా అన్నీ చేసి వడ్డించిన విస్తరిలా పెడితే మాత్రం మొదటి బంతిలో ముందు వరుసలో కూర్చుని త్రేనుపుకుంటూ వెళ్లటానికి మాత్రం సదా సిధ్ధం.... కొత్తగా వచ్చిన బ్లాగర్లు అంటే కూడలి నిర్మాణం/ప్రస్థానం గురించి, వీవెన్ గారి యొక్క అవిరళ కృషి, నిరంతర శ్రమ గురించి తెలియని వాళ్లు లేదా అతితక్కువగా తెలిసిన వాళ్లు దయచేసి నొచ్చుకోకండి నా పై వ్యాఖ్యానాన్ని చూసి ... అది బ్లాగు పెద్దలనీ, సీనియర్ బ్లాగర్లనీ జబ్బలు చరచుకునే, ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తమ సుద్దులతో రడీ అయిపోయే వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లని ఉద్దేశించి ... ఈ విభాగంలో ఎవరూ లేకపోతే మంచిది ... అప్పుడు ఎవరినీ ఉద్దేశించి అన్నట్లు కాదన్నమాట .. కొంచెం కష్టంగా/నిష్టూరంగా అనిపించినా వాస్తవం అలాగే ఉంటుంది.
ఇకపోతే కొత్తగా వచ్చే/వస్తున్న బ్లాగర్లందరికీ అసలు కూడలి నిర్మాణం ఎలా జరిగిందీ, ఇప్పటి వరకు అంతా వీవెన్ ఎలా దీనిని అభివృధ్ధి పరచిందీ ... ఇంకా ఇలాంటి చాలా విషయాలను పరిచయం చేయవలసిన అవసరం ఉంది ... నిజంగా చెప్పాలి అంటే నాకు కూడా దీని గురించి పూర్తి వివరాలు తెలియవు .. నాకు తెలిసి దీనికి రెండు మంచి మార్గాలు ఏమిటి అంటే పైన చెప్పిన 'కొత్త బ్లాగు చేర్చండి' పేజ్ లో ఈ విషయాలు అన్నీ ఇవ్వాలి .. అలాగే వీవెన్ గారు పంపించే activation ఈమెయిల్ లో కూడా ఈ వివరాలన్నీ ఇవ్వాలి.
ఆ బ్లాగులో మన తోటి బ్లాగర్లు (చిన్నమయ్య, కొత్తపాళీ, సిబి రావు, సత్యప్రసాద్ అరిపిరాల గార్లు) వ్రాసిన వ్యాఖ్యలలో నాకు కొంచెం తీవ్రంగా ఉన్నట్టు అనిపించిన వ్యాఖ్య (ఇది మీరు తెలియక చేసిన తప్పు అని తలుస్తాను. కావాలని చేస్తే, మీ బ్లాగుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సుంటుంది. ) సిబిరావు గారిది మాత్రమే. ఊకదంపుడు గారు మాత్రం ఆ టపాలో ఉన్న కొన్ని వ్యాఖ్యలకు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచటమే కాకుండా కూడలిలో చేయదగిన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అభినందనలు మరియు ధన్యవాదములు సరైన రీతిలో ఆలోచించటమే కాకుండా వాటిని సరళంగా వ్యక్తపరచినందులకు.[ సరస్వతీకుమార్ గారు బ్లాగింగ్ లో రాగింగ్ అనే టపాలో కూడా కొన్ని మంచి సూచనలు చేశారు ]
ఇక్కడ వాళ్ల పేర్లు ప్రస్తావించటానికి ముఖ్యకారణం ఏమిటి అంటే ...
- నేనేదో వాళ్లకి వ్యతిరేకమనీ, వాళ్లని అవమానించాను అనీ ... మీలో ఎవరో ఒకరు వారి తరుపున వకాల్తా పుచ్చుకోని, వారి మనసుల్లో/ఆలోచనల్లోకి దూరి అన్నీ తెలుసుకున్నట్టుగా, వారికేదో సపోర్ట్ అన్నట్టుగా (ఈ మధ్య ఇలా మా సపోర్ట్ మీకే అనే బాపతు బాగా ఎక్కువై పోయారు), నేను ఇలా వ్రాయటం తప్పు అనీ, వ్రాయకుండా ఉండవలసింది అనీ ఇక్కడ సొల్లు/చెత్త వ్యాఖ్యలు వ్రాయకండి ... తుప్పు వదలగొడతా ... నాకు మీకంటే ఎక్కువ గౌరవమే ఉంది వీళ్ల మీద ...
- అలాగే మీకెంత తెలుసో ఏది ఎంత వ్రాయాలో నాకు మీకన్నా ఎక్కువ తెలియక పోయినా ఖచ్చితంగా మీతో సమానంగా తెలుసు (అహంభావం అనుకున్నా I don't give a damn). అలాగే వారికి వారి స్పందన ఎలా వ్యక్తపరచాలొ మీకన్నా చాలా బాగా తెలుసు .. ఈ స్పందన, ప్రతిస్పందనలు అనేవి వాళ్లకి నాకు మధ్యన మాత్రమే ఉండనివ్వండి.
- ఇంకొక అతి ముఖ్యమైన కారణం/విషయం ఏమిటి అంటే ఈ సపోర్ట్/తప్పు-ఒప్పులకు సంబంధించి వచ్చే వ్యాఖ్యలతో అసలు విషయం పక్కకు పోయే అవకాశాలే ఎక్కువ అని నేను అనుకోవటం కూడా ఒకటి.
- Anonymous గా వ్యాఖ్యలు వ్రాసినా వదిలిపెట్టను .. ఎందుకంటే కొంచెం తేడాగా వ్రాసిన వాళ్లెవరూ అలా ఊరికే వ్రాసిపోరు .. ఖచ్చితంగా వెనక్కు వచ్చి చూసుకుంటారు ... అందుకే వాళ్లకైతే నా పల్లెటూరి మోటు భాష/సంస్కృతంలోనే నా సమాధానం.
అలాకాకుండా ఈ టపా మీలోని ఆవేశకావేషాలను రెచ్చగొట్టబడితే రెండు నిముషాలు కళ్లు మూసుకుని ధ్యానించి ప్రశాంత చిత్తులై మరొక బ్లాగ్/వ్యాఖ్య చదవటానికి వెళ్లిపోండి. ఇంకా ఆవేశం తగ్గకపోతే మీ బ్లాగుల్లోకి వెళ్లి దీని గురించి రచ్చ రచ్చ చేసుకోండి ... అంతేకానీ ఇక్కడ కాదు.
ఈ టపా ద్వారా నేను చెప్పదలచుకొన్నది రెండే విషయాలు :
- భావి ప్రణాళిక లేకుండా, 'తెలిసే' చేస్తున్నారనే దాని నిర్ధారణకు అవకాశం లేకుండా, కొత్తగా వచ్చే బ్లాగుల్లోనుంచి వచ్చే టపాలను automatic గా control చేసే అవకాశం తెలుసుకోకుండా ఇలా ప్రతి బ్లాగులోకి వెళ్లి ఇలా చేయద్దు అని చెప్పటం వలన ఉపయోగం చాలా చాలా తక్కువ ... ఎందుకంటే అప్పటికే జరగవలసిన damage జరిగిపోయింది కాబట్టి ... అందునా ఇలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు అని చెప్పటం వలన ఎంత అనర్ధం అనేది పక్కన పెడితే ... నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా సమర్ధనీయం కాదు..
- ఇప్పటికైనా కూడలిని సంపూర్తిగా ఆధునీకరించవలసిన అవస్యకతను ఏదో ఉబుసుపోక కబుర్లగా గుర్తించక చాలా సీరియస్ గా దీని గురించిన ఆలోచనలకు అక్షరరూపం ఒక కార్యరూప ఆచరణీయ ప్రణాళికగా అతిత్వరలో implementation phase లోకి తీసుకువెళ్లటానికి ప్రతి ఒక్కరూ సంసిధ్ధులు కావటం.
- ఇప్పటికైనా బ్లాగర్లందరూ వారు ఏ విధంగా ఈ మహత్తర కార్యానికి సహాయం చేయగలరో ...అది డబ్బు రూపేణా కావచ్చు, కొత్త కూడలిలో ఎలాంటి features ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలు అయ్యుండొచ్చు ... developers ని వెదికి పెట్టటం కావచ్చు ... మొత్తం site తయారు అయిన తరువాత కొన్ని రోజులు/గంటలు టెస్టింగ్ చేసిపెట్టటం ... FAQ లేదా How to - documents/posts/pages వ్రాయటం ... కొత్త advertisers ని వెదికిపెట్టటం ... ఇలాంటి వాటన్నిటినీ సాధ్యమైనంత తొందరగా నలుగురితో పంచుకోవటం/చర్చించటం.
............................................................................
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
ఇరాక్ యుధ్ధం వలన బాగా లాభపడిన కంపెనీలు
ఇరాక్ పైకి అమెరికా యుధ్ధానికి వెళ్లటం అనేది న్యాయమా, అన్యాయమా అనేది పక్కన పెడితే అసలు దీని వలన కొన్ని కంపెనీలు ఏ స్థాయిలో లాభపడ్డాయో/లాభపడుతున్నాయో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం మరికొంత గగుర్పాటు కలుగుతుంది.
ఈ కంపెనీలలో మొదటిగా చెప్పుకోవలసిన Halliburton 2003-2006 మధ్యకాలంలో సంపాదించింది $17.2 Billion మాత్రమే .. ఈ కంపెనీ వెనుక ఎవరు ఉన్నదీ మీకు Google లో వెదికితే కనుక్కోవటం అంత కష్టం ఏమీ కాదు :-)
పూర్తి వివరాలకు : The 25 Most Vicious Iraq War Profiteers
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
ఆధునిక అక్షరమాలలో ఎన్ని తెలుసు మీకు - Web Savvy తల్లిదండ్రులారా !?
ఇప్పటికే అ-అమ్మ, ఆ-ఆవు, ఇ-ఇల్లు అనే వాటికి బదులు A-Apple, B-Ball, C-Cat అని మనం చక్కగా పిల్లలకు నేర్పుతుంటే ... దీనికే/ఇలాంటి వాటికే తెలుగు భాష మూలన పడిపోతుంది ... వాడకం తగ్గిపోతుంది ... తల్లిదండ్రులే పిల్లల కన్నా ఎక్కువగా వారిపై ఈ ఆంగ్లభాషను రుద్దుతున్నారు అని మనం బాధపడిపోతుంటే ... Web Savvy తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొత్తగా ఒక అక్షరమాల Internet లో సంచారం చేస్తుంది ... ప్రస్తుతానికి సరదాగానే అయ్యుండొచ్చు గానీ ఇలాంటి వాటికి మనం ఎంతో దూరంలో లేమేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ ... దానిని ఇక్కడ మీకు అందించాలనే ప్రయత్నమే ఈ టపా ..
మరి ఇక ఆలస్యం చేయక ఈ అక్షరమాల పని పట్టండి .. చూద్దాం ఇప్పటికప్పుడు ఎన్ని కనిపెట్టగలమో ...
ఈ ఆధునిక సాంకేతిక/వెబ్ ప్రపంచంలో ఖచ్చితంగా మన పిల్లలు ఇలాంటి వాటిల్లో మన కన్నా ముందు ఉండే అవకాశం ఉంది కాబట్టి ... కొద్దో గొప్పో ప్రయత్నించండి ... ఎలాగూ చాలా వరకు తెలిసినవే ఉన్నాయి కదా ..
వాళ్లు అడిగినప్పుడు అన్నిటికీ తెల్ల మొహం వేసే బదులు కనీసం కొన్నింటికైనా సమాధానం తెలిసి ఉంటే మంచిదేమో కదా ..
అయినా ఇప్పుడు మనకి ఈ అక్షరాభ్యాసం అవసరమా అంటే అది కాలమే నిర్ణయిస్తుంది .. తెలుసుకుంటే తప్పేమీ లేదు ... ఏదో కొంత విజ్ఞానాభివృధ్ధి అయినా అవుతుంది కదా ... దూకండి మరి రంగంలోకి .... లేదా సరదాగా చూసి వదిలెయ్యండి ...
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
Laptop లను శుభ్రం చేయటం ఎలా ?
******************************************
నల్లమోతు శ్రీధర్ గారి సాంకేతిక బ్లాగ్ లో
లాప్టాప్ల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. అనే టపాకు పూర్ణిమ గారు లాప్-టాప్ లను ఎలా శుభ్రం చేయాలి అని అడిగిన ప్రశ్నకు శ్రీధర్ గారి సమాధానంతో పాటు నేను ఇచ్చిన సమాధానాన్ని మరలా ఇక్కడ ... పూర్ణిమ గారితో పాటు మనలో ఇంకా మరికొంత మందికి అయినా ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనే ఈ టపా ..
Laptop లను శుభ్రం చేయటానికి ఈ కింద లంకెలలో ఉన్న సమాచారం చూడండి.
How to Clean A Laptop Computer
How to Clean a Laptop Screen With Household Products
వివిధ రకాలైన సైట్స్ లో వివరించిన చిట్కాలు/సూచనలు/సలహాలు ఆచరించబోయే ముందు ఒకవేళ మీకు వీడియోలో చూస్తే ఇంకా బాగా ఉంటుంది అనిపిస్తే ఈ కింద ఉన్న వీడియో లంకెను నొక్కండి లేదా అంతకు దిగువన ఉన్న వీడియోను ఇక్కడే చూడండి.
How To Clean A Laptop - Video
లేదా
ఆడుతూ పాడుతూ శుభ్రం చేయండి ... అలుపూ సొలుపూ లేక చక్కగా బ్లాగండి.
మరలా ఇలాంటి మరికొన్ని చిట్కాలతో లేదా మరింత సమాచారంతో కలుద్దాం ... అంతవరకూ శెలవా మరి !!!!!
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
TV TRP Ratings గురించి కొంత సమాచారం
బుల్లితెర అనే కొత్త బ్లాగులో ఒకానొక టపా వెర్రితలలు వేస్తున్న నేషనల్ మీడియా కు వ్యాఖ్య రాసే సందర్భంలో చేయిజారి TRP Ratings అని ఒక పదం ఉపయోగించా .. అంతే అబ్రకదబ్ర గారు వాటిని ఎలా ఇస్తారు అని ప్రశ్నించగా నేను మొదలు పెట్టిన వివరణ ఇంతింతై వటుడింతై అన్న చందంగా చాలా పెద్ద వివరణై కూర్చుంది .. సరే ఆ వివరణ అంతా ఇలా ఒక కొత్త టపాగా రాయటం ద్వారా, బుల్లితెర అనబడే ఈ కొత్త టపాను నలుగురికీ పరిచయం చేసినట్టుగానూ మరియు ఆ సమాచారం అంతా ఇలా బ్లాగస్థం చేసినట్టుగానూ ఉంటుంది అనే ఆలోచనకు అక్షరరూపమే ఈ ప్రయత్నం.
అనటానికి వీటిని TRP (Telivision/Target Rating Point) లేక GRP(Gross Rating Point) అని అంటారు గానీ ... మీకు దీని గురించి ఖచ్చితమైన వివరాలు కావాలంటే Nielsen Ratings అని వెదకండి/చదవండి.
మీకు ఓపిక/ఆసక్తి అంటే ఇదిగోండి లంకె : Nielsen Ratings
ఓపిక/ఆసక్తి లేకపోతే క్లుప్తంగా చెప్పాలి అంటే ...
:::
Nielsen Television Ratings are gathered by one of two ways; by extensive use of surveys, where viewers of various demographics are asked to keep a written record (called a diary) of the television programming they watch throughout the day and evening, or by the use of Set Meters, which are small devices connected to every television in selected homes. These devices gather the viewing habits of the home and transmit the information nightly to Nielsen through a "Home Unit" connected to a phone line. Set Meter information allows market researchers to study television viewing habits on a minute to minute basis, seeing the exact moment viewers change channels or turn off their TV. In addition to this technology, the implementation of individual viewer reporting devices (called people meters) allow the company to separate household viewing information into various demographic groups.
:::::
ఇండియాలో కూడా ఈ మీటర్ పెట్టెల వ్యవహారమేనండీ ... కాకపోతే ఇది కొన్ని రాష్ట్రాలకే, అందులోనూ కొన్ని నగరాలకే పరిమితం ... ఇది కూడా చాలా తక్కువ శాతం .. ఇక పల్లెల గురించి మీకు తెలిసిందే కదా ...
నా దగ్గర ఉన్న ఒక పాత లంకెలో TRIPPING OVER THE TRP TRAP చాలా వరకు సమాచారం ఉంది ... ఇంత కన్నా కొత్త లంకెలు ఏమీ లేవండీ .. సారీ...
(ఇలా అతి తక్కువ శాతంతో లెక్కకట్టిన రేటింగ్స్ తో ఇండియా మొత్తానికి ఈ వ్యూయర్ షిప్ ఎలా ఆపాదిస్తారు అని ప్రస్తుతం స్టార్, సోనీ, జీ ల మధ్య ఒక ప్రత్యక్షయుధ్ధమే జరుగుతోంది .. ఈ రేటింగ్స్ మీదే వ్యాపారప్రకటనల విలువ ఆదారపడి ఉంటుంది అని మీకు తెలుసు కదా .. స్టార్ వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అని ... సోనీ, జీ ఈ రేటింగ్స్ ని బాయ్ కాట్ చేయాలి అని నిర్ణయించుకున్నాయి కొంతకాలం క్రితం .. ఇప్పటి పరిస్ఠితి ఏమిటో తెలియదు)
ఈ రేటింగ్స్ డాటా అంత కలిపి ఒక అయిదు/ఆరు వేల కుటుంబాల (ఈ మధ్య కాలంలో ఈ సంఖ్య కొద్దిగా పెరిగి ఉండవచ్చు .. కొత్త నగరాలు/పట్టణాలు జత చేసి ఉంటారు కాబట్టి) నుంచే అంటే దీనికి ఉన్న విలువ ఏపాటిదో ఉహించుకోవచ్చు. అందుకే మన డిడి వాళ్లు ఒక ప్రత్యేకమైన రేటింగ్స్ DART (Doordarshan Audience Ratings) ను ఫాలో అవుతారు. ఇది కూడా సర్వేల మీద ఆధారపడేదే కానీ కాకపోతే ఎక్కువ మంది ద్వారా వివరాలు(సర్వే/డైరీ ఇచ్చిన తరువాత వారానికి వచ్చి వీటిని collect చేస్తారు) సేకరిస్తారు.
ఇండియాలో ఇది చేసే సంస్థ ... INTAM (Indian Television Audience Measurement)
ఇకపోతే కేబుల్ ఆపరేటర్లకి ఏమన్నా పద్ధతులుంటాయా - ఏ ఇంట్లోవాళ్లు ఏ ఛానల్ చూస్తున్నారో కనుక్కోటానికి? అనే ప్రశ్నకు సమాధానం ... ప్రస్తుతానికి ఇండియాలో ఏమీ లేవు (పల్లెటూళ్లే కాదు నగరాలలో/పట్టణాలలో కూడా లేవనుకోండి) ...
ఇండియాలో ప్రస్తుతం ఒక కొత్త రకమైన మెజర్ మెంట్ వచ్చింది ... అదే మొబైల్ ద్వారా వివరాలు సేకరించటం .. పూర్తి వివరాలు ఇక్కడ : Yesterday who watched what
ఇకపోతే ఇప్పుడిప్పుడే ఇక్కడ అమెరికా లాంటి దేశాలలో కేబుల్, ఫైబర్ ఆప్టిక్, బ్రాడ్ కాస్ట్ మరియు సాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలకు సంబంధించి పేటెంట్ పెండింగ్ టెక్నాలజీ ఒకటి ఇప్పుడే మార్కెట్ లోకి వస్తూ ఉంది .. మీకు మరిన్ని వివరాలు కావాలంటే ... Digital Audience Measurement and Tracking అనే సైట్ లోకి వెళ్లండి.
ఈ సెట్-టాప్ పెట్టెలలోనే ఇదంతా ఉంచటానికి చాలా విరివిగా ప్రయత్నాలు జరిగాయి/జరుగుతున్నాయి కాకపోతే ఇదే సమయంలో ఇండియా/చైనా అనూహ్యంగా పుంజుకోవటం, కుడి ఎడంగా ఇదే సమయంలో అమెరికా/యూరప్ లాంటి దేశాలలో ఈ డిజిటల్ వ్యూయర్-షిప్ పెరగటం, ఒకే కేబుల్ ద్వారానే ఇంటర్నెట్/టివి కార్యక్రమాలు రావటం, ముఖ్యంగా ఈ రేటింగ్స్ యొక్క పరిధి, సాధికారత మొదలగు వాటిపై అనేకానేక సందేహాలు తలెత్తటంతో ఈ రంగంలో కొంత diversified R&D జరగటానికి అవకాశం ఏర్పడింది. అలాగే ప్రస్తుతం నిపుణులు ఊహించిన విధంగా ఇండియాలో IPTV సేవలు వాప్తిలోకి వస్తే మరికొంత విస్కృతమైన రేటింగ్స్ డాటా లభించే అవకాశం ఉంటుంది.
మరికొన్ని వివరాలకు : Measuring the TRPs
ఇంతే సంగతులు .. చిత్తగించవలెను ... :-)
కొంచెం ఎక్కువ అయ్యిందంటారా విషయ వివరణ !?...
ఎందుకు అడిగామురా బాబు అని అబ్రకదబ్ర గారు అనుకుంటున్నారేమో మరి పాపం ! :-(
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
Free and Premium Templates for your Blogger/Wordpress Blogs
సి.బి.రావు గారు రాసిన టపా బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 1 లో బ్లాగ్ టెంప్లేట్స్ మార్చటం గురించి చదివిన తరువాత ఇప్పటికే నా దగ్గర అందుకు సంబంధించిన వివరాలు ఉండటంతో అవి మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...
మీరు మీ టెంప్లేట్ మార్చాలి అనుకుంటే ..... ముందుగా ...
1. మీకు ఆ టెంప్లేట్స్ లో ఎన్ని కాలమ్స్ (రెండా, మూడా లేక నాలుగా) కావాలో నిర్ణయించుకోండి. [ నావరకైతే Four Columns Templates అంత బాగా నచ్చలేదు ... సూటిగా చెప్పాలి అంటే వికారంగా ఉన్నట్టనిపిస్తుంది. నేను ఎక్కువగా ఇష్టపడేది Three Columns Templates ]
2. మీ బ్లాగ్ లో మీరు ఏ విషయంపై ఎక్కువగా రాస్తున్నారో/రాయాలనుకుంటున్నారో ఆలోచించి దానికి అనుగుణంగా మీ టెంప్లేట్ యొక్క (హ)రంగులు ఉండేలా చూసుకోండి. (ఇలానే ఉండాలి అన్న నియమం ఏమీలేదనుకోండి ... ఉంటే ఆహ్లాదంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది .. అలాగే ఈ రంగులు మీ టపాలలోని భావాన్ని పాఠకుడికి అదే అనుభూతి కలిగించటంలో/చేరవేయటంలో ఎంతో కొంత దోహదపడతాయి).
3. మీ బ్లాగ్ ఎటువంటి టపాలు కలిగి ఉంది/ఉండబోతుంది అంటే మీ బ్లాగ్ ఏ విభాగం కిందకు వస్తుంది అన్నది నిర్ణయించుకోండి ... ఎందుకంటే ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగానికి ప్రత్యేకమైన, రెడీమేడ్ టెంప్లేట్స్ మీరు చాలా సులభంగా సంపాదించవచ్చు.
4. మీ బ్లాగ్ లో మీరు పొందుపరచాలి అనుకుంటున్నారా అనేది కూడా ఒక ముఖ్యమైన విషయమే .... అవును అనేది మీ సమాధానం అయితే మీరు వాడబోయే టెంప్లేట్ వాటిని సపోర్ట్ చేస్తుమ్దో లేదో చూసుకోండి ముందుగానే (కాకపోతె ఈ మధ్య కాలంలో వచ్చిన/వస్తున్న టెంప్లేట్స్ అన్నీ వీటిని సపోర్ట్ చేస్తున్నాయి).
5. మీరు వ్యాపార ప్రకటనలు చూపించాలి అనుకుంటున్నారా? అవును అనుకుంటే, వివిధ రకాలుగా వీటిని చూపించగలిగిన ప్రత్యేకమైన టెంప్లేట్స్ ఉన్నాయి. వాటినే ఎంచుకోండి. (ఇంకా మన తెలుగు బ్లాగులు ఈ వ్యాపార స్థాయికి రాలేదు అనుకోండి .. కాకపోతే కొన్ని సాంకేతిక బ్లాగుల్లో ఇవి ఉంటే బాగానే ఉంటుంది)
6. మీ బ్లాగ్ మీద మీకు మమకారం ఎక్కువ అయిపోయి ఇంకా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలనుకోవటమో లేక ఒక ప్రొఫెషనల్ లుక్ ఉంటే బాగుంటుందేమో అనిపించటమో లేక ఇంకా చాలా ఎక్కువ కష్టమైజేషన్ options ఉంటే బాగుంటుంది అనిపించటమో జరిగితే మీరు ప్రీమియం టెంప్లేట్స్ వాడుకోవచ్చు. ఇవి సాధారణంగా $45 నుంచి $99 లోపల లభ్యమవుతాయి (ఇండియాలో ఇలా అమ్మే సైట్స్ ఏవీ నాకు తెలియవు కనుక వాటి ధరల విషయం నాకు తెలియవు). దురదృష్టవశాత్తు ఈ ప్రీమియం టెంప్లేట్స్ వ్యవహారంలో Wordpress వారికి లభ్యమైనన్ని Blogger వారికి లేవు. అలాగే Professional/Commerical Sites అన్నీ చాలా వరకు Wordpress వాడటానికి ఇష్టపడతాయి.
7. చిన్నచిన్నవి అనిపించే Menu Options, Paypal Donate Me Button, SEO (Search Engine Optimization) మరియు Flickr Photos మొదలగునవి ఉంటే బాగుంటుందేమో ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవి అన్నీ రెడీమేడ్ గా పొందుపరచబడిన టెంప్లేట్స్ దొరుకుతాయి కనుక వాడకం సులభం అవుతుంది.
Blogspot.com వారికి :
Three Columns :
FreeTemplates
WebTalks
BlogCrowds
Two columns :
FreeTemplates
BlogCrowds
For more .... collection on beautiful 2/3 column blogger Templates :
Free Templates :
Gridblog -
See a Demo of this Template
Download this Template
FireBug -
See a Demo of this Template
Download this Template
Blog Oh Blog -
See a Demo of this Template
Download this Template
Premium Wordpress Templates :
Take a look at the CornerStone 2.0 template which was used in ' Navatarangam ' .
Revolution Theme .. నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇది ఒకటి
Peter And Rejensen
The Blog Entrepreneur.com
Men With Pens
Gadget Crunch .. నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇది ఒకటి
Mimbo Pro ... Expensive but unbelievably fantastic theme. I like this a lot.
Artecg ... Modified version of the above. Amazing Template .. I like this very much.
Themesdemo - WpThemesPlugin
Premium News Theme
WP Magazine
Dubtastic
Rock In Themes
For the price list and also the Top/Best Wordpress Premium Themes :
ఒకవేళ మీకు కొంచెం ఓర్పు మరికొంచెం కళాపోషణ ఉంటే మీకు నచ్చిన రంగులు, ఎన్ని కాలమ్స్ ఉండాలి, మెనూ/కేటగిరీ ఎక్కడ/ఎటువైపు ఉండాలి మొదలగునవి అన్నీ డైనామిక్ గా మార్చుకొని మీకు నచ్చిన తరువాత కోడ్ జెనరేట్ చేసుకుని మీ బ్లాగ్ లోకి కాపీ/పేస్ట్ చేసుకోవచ్చు. అలా చేయాలి లేక చేయగలము అనుకుంటే ఈ కింద ఉన్న లంకెను నొక్కండి.
Web-based Wordpress Theme Editor
ముఖ్య గమనిక : మీరు ఈ ఉచిత టెంప్లేట్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ బ్లాగ్స్ లో install చేసుకుంటే దయచేసి ఆ టెంప్లేట్ లో ఉన్న లంకెలు (టెంప్లేట్ తయారు చేసిన వారి లేక సైట్ యొక్క లంకెలు) తొలగించకండి.
ఇవికాక మీకు తెలిసినవి/నచ్చినవి ఇంకా ఎమైనా ఉంటే నలుగురితో పంచుకోండి. నాకు వీలైనప్పుడు మరికొన్నిటితో ఇంకోసారి కలుద్దాం. అంతవరకూ మీరు టెంప్లేట్ మార్చే పనిలో ఎంజాయ్ చేయండి. సెలవా మరి.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..